: గూగుల్ సెర్చ్ ఇండియా 'టాపర్' సన్నీ లియోన్
2015లో భారతీయులు ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసిన వ్యక్తి సన్నీలియోన్ కావడం విశేషం. సల్మాన్, షారూఖ్ వంటి నటీనటులను, అబ్దుల్ కలామ్, నరేంద్ర మోదీ వంటి నేతలను తోసిరాజని గూగుల్ సెర్చ్ లో సన్నీ తన పాప్యులారిటీని కొనసాగించడం గమనించదగ్గది. సినిమాలతో వివాదం రేపే సన్నీ లియోన్, కండోమ్ యాడ్ లో నటించి మరింత వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో సన్నీ లియోన్ టాప్ లో నిలవగా, తరువాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారూఖ్ ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, అలియా భట్, నరేంద్ర మోదీ నిలవడం విశేషం.