: జగన్ సభలో ఏం చెబితే ఆ పార్టీ సభ్యులు అదే చేస్తున్నారు: చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సహా చాలా మంది ఎమ్మెల్యేలు కొత్తవారేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. తరువాత బాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంబేద్కర్ 125వ జయంతిపై సభలో చర్చించాల్సి ఉండగా వైసీపీ నేతలు అడ్డుపడ్డారన్నారు. వారి తీరువల్ల అంబేద్కర్ అంశం చర్చకు రాకుండా పోయిందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ సభలో ఏం చెబితే ఆ పార్టీ సభ్యులు అదే చేస్తున్నారని మండిపడ్డారు.