: జార్ఖండ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు!
జార్ఖండ్ ఉప ఎన్నికల్లో భాగంగా లోహార్ డగా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుఖదేవ్ భగవత్ విజయం సాధించారు. బీజేపీ మద్దతిచ్చిన ఏజేఎస్యూ అభ్యర్థి నీరూ భగత్ ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్న కమల్ కిషోర్ భగత్ కు ఓ కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడటంతో ఉప ఎన్నికలు జరుగగా, ఆయన తన భార్య నీరూను రంగంలోకి దింపారు. గిరిజనులకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో డిసెంబర్ 14న పోలింగ్ జరుగగా, 2.20 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ఇప్పటికే సుఖదేవ్ విజయం ఖాయమైంది.