: ఇస్రోకు పార్లమెంట్ ఉభయసభల అభినందన
ఆరు సింగపూర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతం కావడం పట్ల పార్లమెంట్ ఉభయసభలు ఇస్రోకు అభినందనలు తెలిపాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ప్రశంసలు కురిపించారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష శాస్త్రవేత్తల పనితీరు దేశానికి గర్వంగా ఉందని ఆమె అన్నారు. భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాల్లోనూ ఇస్రో విజయం సాధించాలని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారి కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు.