: ఉగ్రవాదులంతా ముస్లింలే... ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు: టెడ్ క్రూజ్


యూఎస్ లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో ముస్లింలపై చేస్తున్న వ్యాఖ్యలను ఆయనకు ప్రధాన పోటీదారుగా ఉన్న టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రూజ్ ఖండించారు. ఉగ్రవాదులంతా ముస్లింలే కావచ్చని, అంతమాత్రాన ముస్లింలంతా ఉగ్రవాదులన్న అభిప్రాయానికి రావడం తప్పని అన్నారు. పలు దేశాల్లో ముస్లింలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని, వాటిల్లో ఇండియా కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ఎంతో మంది అమెరికన్ నేతలు 15 శాతం వరకూ ముస్లింలు ఉన్న ఇండియా వంటి సెక్యులర్ దేశాల గురించి ఎన్నో సార్లు ప్రస్తావించారని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని, ఇదే సమయంలో అమాయక ముస్లింల ప్రాణాలనూ కాపాడాలని టెడ్ వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్ తరువాతి స్థానంలో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి సరైన అభ్యర్థిగా టెడ్ క్రూజ్ ను భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News