: తైవాన్ తో అమెరికా ఆయుధ ఒప్పందంపై చైనా సీరియస్


వేల కోట్ల రూపాయల విలువైన రెండు యుద్ధ నౌకలను తైవాన్ కు అందించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ మేరకు చైనాలో అమెరికా రాయబారికి సమన్లు పంపింది. 1949లో చైనా, తైవాన్ విడిపోయిన తరువాత, రెండు దేశాల మధ్యా కొనసాగిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పటికీ తగ్గలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్ కు యుద్ధ నౌకలను విక్రయించడంపై కోపంగా ఉన్న చైనా, తక్షణం ఈ డీల్ ను విరమించుకోవాలని డిమాండ్ చేస్తోంది. కాగా, గత కొంత కాలంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా జరుపుతున్న మిలటరీ కార్యకలాపాలు, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, చైనా ప్రమేయాన్ని తగ్గించాలని భావిస్తున్న అమెరికా తన వ్యూహత్మక నిర్ణయాల్లో భాగంగా తైవాన్ తో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తైవాన్ కు ఇవ్వనున్న యుద్ధ నౌకల్లో యాంటీ-ట్యాంక్ మిసైల్స్, ఏఏవీ-7 యాఫిబియస్ (ఉభయచర) అసాల్ట్ వెహికిల్స్, ఇతర ఆయుధాలు ఉంటాయని సమాచారం.

  • Loading...

More Telugu News