: కాల్ మనీ ఎఫెక్ట్... ట్రాఫిక్ కు పటమట సీఐ దామోదర్ బదిలీ


ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలను ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టిన కాల్ మనీ వ్యవహారం పోలీసుల మెడకూ చుట్టుకుంటోంది. కాల్ మనీ నిర్వాహకుల వేధింపులపై బాధితులు చేసిన ఫిర్యాదులపై సకాలంలో స్పందించలేదన్న కారణంగా విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దామోదర్ ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News