: నా కూతురి పేరు జ్యోతి సింగ్: బహిరంగంగా ప్రకటించిన ‘నిర్భయ’ తల్లి


మూడేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల అనంతరం ఆ విద్యార్థిని ప్రాణాలు విడవటం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేర ఇలాంటి కేసుల్లోని బాధితురాలి పేరు బయటపెట్టరు. అందుకే, ఆమె పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ‘నిర్భయ’ (ఈ పేరును ఓ ఆంగ్ల పత్రిక ఆమెకు ఇచ్చింది) అనే పేరును ఉపయోగించడం విదితమే. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సభలో ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రినాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశాదేవి మాట్లాడుతూ, ‘నా కూతురి పేరు జ్యోతిసింగ్‌. ఆమె పేరును వెల్లడించడానికి సిగ్గుపడటం లేదు. హింసకు గురైనవారు తమ పేరును దాచాల్సిన అవసరం లేదు. నేరస్తులు సిగ్గుపడి తమ పేరును దాచుకోవాలి గానీ బాధితులు కాదు. ఈ రోజు నుంచి ప్రతిఒక్కరూ తమ కూతురు పేరును జ్యోతిసింగ్‌గా గుర్తించాలి’ అంటూ ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20న విడుదల కానున్న బాల నేరస్తుడి విషయమై ఆమె మాట్లాడుతూ, అతన్ని విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News