: గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి హొలాండే
2016 భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండేను ఆహ్వానించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ప్రకటించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఆయన వస్తున్నారని ఆయన తెలిపారు. ఆయనకు సాదర స్వాగతం పలకనున్నామని ఆయన చెప్పారు. హొలండే రాకతో రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, ఈ ఏడాది జనవరి 26న నిర్వహించిన గణతంత్రదినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విచ్చేసిన సంగతి తెలిసిందే.