: ఆ వ్యాఖ్యలు బాధిస్తే క్షమించండి: షారూక్ ఖాన్


‘అసహనం’ వ్యాఖ్యలపై బాలీవుడ్ బాద్ షా క్షమాపణలు చెప్పాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో విపరీతమైన మత అసహనం చోటుచేసుకుందంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా, ఏబీపీ న్యూస్ తో షారూక్ ఖాన్ మాట్లాడుతూ, ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే కనుక క్షమించాలని కోరారు. ఎలాంటి అసహనాన్ని తాను ఎదుర్కోలేదని, ఈ అంశంపై తాను ఎన్నడూ మాట్లాడలేదని అన్నాడు. అయితే, ఈ నెల 18 తేదీన తాను నటించిన చిత్రం 'దిల్ వాలే' విడుదల కానున్న నేపథ్యంలో మాత్రం క్షమాపణలు చెప్పడం లేదని షారూక్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News