: నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్ఎల్వీ సీ-29
శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-29 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. సాయంత్రం 6 గంటలకు రాకెట్ ను ప్రయోగించారు. పీఎస్ఎల్వీ తనతో పాటు సింగపూర్ కు చెందిన 6 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. నిర్ణీత కక్ష్యలో ఈ శాటిలైట్లను ప్రవేశపెట్టనుంది. షార్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ప్రయోగాల్లో ఇది 50వ ప్రయోగం కావడం విశేషం. సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయి, దూసుకెళుతున్న పీఎస్ఎల్వీ ఇప్పటికే మూడు స్టేజ్ లను దాటేసింది.