: కత్తులు నూరుతున్న సోనూ సూద్!
బాలీవుడ్ నటుడు సోను సూద్ కత్తులు నూరుతున్నాడు. ఎవరి పైనో అని అనుకుంటున్నారా? కాదులెండి... 'కుంగ్ ఫూ యోగ' అనే చైనా చిత్రంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజు హర్షవర్ధనుడి పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కత్తి యుద్ధంలో తర్పీదు పొందాడు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ, శిక్షణ నిమిత్తం రోజుకు ఆరు గంటల పాటు కష్టపడ్డానని చెప్పాడు. కత్తి యుద్ధం చేస్తుంటే మంచి ఎక్సైర్ సైజ్ చేసినట్లేనని చెప్పాడు. కాగా, అంతర్జాతీయ నటుడు జాకీ చాన్ తో కలిసి ఈ చిత్రంలో సూద్ నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు.