: రంగారెడ్డి జిల్లాలో ఐదు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జల్ పల్లి, మీర్ పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కొన్నిరోజుల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించే అవకాశం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి కోడ్ ముగిసిన వెంటనే మున్సిపాలిటీల ఏర్పాటు ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.