: పుట్టింటి పేరు కోసం పోరాడిన జపాన్ మహిళలకు భంగపాటు


పుట్టింటి పేరు కోసం జపాన్ మహిళలు చేసిన పోరాటం విఫలమైంది. తమకు అత్తింటి పేరులాగే పుట్టింటి పేరు కూడా కావాలంటూ కొంతమంది మహిళలు చేసిన డిమాండ్ ను సాధించుకునే విషయంలో వీరు ఓడిపోయారు. ఇందుకు ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించడంతో బోరున విలపిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... సాధారణంగా ఏ అమ్మాయికైనా పెళ్లయ్యాక భర్త ఇంటి పేరే ఆమెకు వర్తిస్తుంది. అప్పటినుంచి పుట్టింటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరు వచ్చి చేరుతుంది. ఎప్పటినుంచో జపాన్ లో కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ, కొంతమంది మహిళలు అత్తింటి పేరుతో సమానంగా పుట్టింటి పేరు కూడా కొనసాగించుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు ఓ ఐదుగురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. పెళ్లి చేసుకున్న తరువాత కచ్చితంగా ఒకే ఇంటిపేరును కలిగి ఉండాలే తప్ప రెండు పేర్లు ఉపయోగించుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎప్పుడో 19 శతాబ్దంలో చేసిన చట్టాన్ని దృఢపరుస్తూ ఎలాంటి మార్పు చేసేదిలేదని పేర్కొంది. తీర్పుపై తీవ్ర నిరాశ చెందిన క్యోక్యో సుఖామో అనే మహిళ మాట్లాడుతూ, "తీర్పు వినే సమయంలో నా కళ్లల్లో నీళ్ల సుడులు తిరిగాయి. నేను చాలా విచారంగా ఉన్నాను. చాలా బాధగా ఉంది. నా పేరు... నా గుర్తింపు" అంటూ కోర్టు ప్రాంగణంలోనే రోదించింది.

  • Loading...

More Telugu News