: వరద ప్రభావిత ప్రాంతాన్ని దత్తత తీసుకుంటా: సినీ దర్శకుడు మణిరత్నం
చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతం కొట్టుపురంలోని సూర్యనగర్ ను ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం దత్తత తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఒక ఎన్జీవో సంస్థ ద్వారా, ఆయన భార్య నటి సుహాసిని ఇందుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకోనున్నట్లు చెప్పారు. చెన్నైలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల్లో తాను కూడా తోడ్పడాలన్న ఉద్దేశ్యంతోనే సూర్య నగర్ ను దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మణిరత్నం, ఆయన టీమ్ కు సంబంధించిన సభ్యులు కొంతమంది ఇటీవల సందర్శించారు. కాగా, చెన్నై మహానగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడి పలు కాలనీలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పరంగా సాయం అందుతున్నప్పటికీ, సినిమా రంగంతో బాటు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.