: బస్సును ఇల్లుగా మార్చుకున్నాడు!


అభిరుచికి తగ్గట్టుగా సౌకర్యవంతమైన సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని కలలు కనని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో సచిమిద్ అనే నిరుద్యోగికి సొంత ఇల్లు పొందాలనేది కోరిక. అయితే అక్కడ ఇల్లు కొనాలంటే కనీసం లక్ష డాలర్లు వెచ్చించాల్సిందే. తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో సొంత ఇల్లు ఎలా సమకూర్చుకోవాలా? అని మధనపడేవాడు. ఇంతలో 1990లో వాడిన పాతబస్సు అమ్మకానికి వచ్చింది. దీంతో తన తండ్రితో మాట్లాడి, అతని సహకారంతో 4,500 డాలర్లు ఖర్చు చేసి ఆ బస్సును కొనుగోలు చేశాడు. మరో 9,000 డాలర్లు ఖర్చు చేసి, మూడు నెలలు శ్రమ పడి దానిని అత్యంత సౌకర్యవంతమైన ఇల్లుగా మార్చుకున్నాడు. టాప్ కు సోలార్ ప్యానెల్స్ అమర్చి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడు. కిచెన్, బాత్రూం, బెడ్ రూం వంటి సౌకర్యాలు తక్కువ ఖర్చుకు ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో, ఈ 'బస్సు ఇల్లు'ను కేవలం నివాసానికి మాత్రమే కాదని, వివిధ ప్రాంతాలు చుట్టి వచ్చేందుకు కూడా వినియోగిస్తానని సంతోషంగా చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News