: మ్యాగీ నూడుల్స్ కి మళ్లీ పరీక్షలు నిర్వహించండి: సుప్రీంకోర్టు


నెస్లే ఇండియా ఉత్పత్తి మ్యాగీ నూడుల్స్ మళ్లీ ల్యాబ్ పరీక్షలు ఎదుర్కోబోతోంది. వీటిని మైసూర్ ల్యాబరేటరీలో పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. వినియోగదారుల పానెల్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం పేర్కొంది. ఇప్పటికే ఎన్సీఆర్డీ (నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్) 16 మ్యాగీ శాంపిల్స్ ని పరీక్షల కోసం పంపింది. ఐదు నెలల తరువాత బాంబే హైకోర్టు తీర్పుతో మ్యాగీ గత నెల నుంచి కొత్తగా ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ లోకి కూడా నూడుల్స్ వచ్చేశాయి.

  • Loading...

More Telugu News