: వరద బాధితుల సహాయార్ధం రూ.130.33 కోట్ల విరాళాలు: తమిళనాడు ప్రభుత్వం


భారీ వర్షాలు, వరదలతో నిరుపేదలైన తమిళనాడు వాసులకు ఇప్పటివరకు వచ్చిన విరాళాల వివరాలను తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. బాధితుల పునరావాసం, సహాయ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.130.33 కోట్ల విరాళాలు వచ్చినట్టు తెలిపింది. తాజాగా అగ్రశేణి కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఇద్దరు ప్రముఖులు రూ.16 కోట్లు సహాయం చేశారు. వారిలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్.శేషసాయి రూ.10 కోట్లు, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రూ. 6.50 కోట్లు సీఎం జయలలితకు అందజేసినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది.

  • Loading...

More Telugu News