: రంగారెడ్డి జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడ్చల్, శామీర్ పేట మండలాల్లో టీడీపీ పూర్తిగా తుడుచుకుపోయిందన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఇక ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని చెప్పారు. టీడీపీ ముమ్మాటికీ పక్క రాష్ట్రం పార్టీనే అని అన్నారు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారని, టీడీపీని ఏపీకి సంబంధించిన పార్టీగా ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ హైకమాండ్ తెలంగాణలో ప్రతి పల్లెలో ఉందన్నారు.