: ఢిల్లీలో సీబీఐ సోదాలకు ఇది సరైన సమయం కాదు: శత్రుఘ్న సిన్హా


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పందించారు. తనిఖీలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సీబీఐ సోదాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. తనిఖీలు చేయాలని ఎవరు సలహా ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో టైమ్ చాలా ముఖ్యమని, సోదాలు చేసేందుకు ఇది కచ్చితంగా తగిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. అయితే కేజ్రీవాల్ కు పాప్యులారిటీనే కాకుండా మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువంటూ సిన్హా ప్రశంసించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిరికిపంద, సైకో అంటూ సీబీఐ తనిఖీల తరువాత కేజ్రీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

  • Loading...

More Telugu News