: హైదరాబాద్ లో గూగుల్ నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తాం: సుందర్ పిచాయ్
భారత్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీలో తమ సంస్థ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్ లో గూగుల్ నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పిచాయ్ ప్రకటించారు. దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం ఆ నూతన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అంతేగాక భారత్ లోని 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. వచ్చే డిసెంబరులోగా రైల్ టెల్ సహకారంతో వైఫై సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.