: రూ. 2,400 కోట్లు వెచ్చిస్తే... నెలలోనే షెడ్డుకొచ్చింది!


అమెరికన్ సర్కారు 360 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,400) కోట్లు వెచ్చించి తయారు చేసిన లైట్ వెయిట్ కంబాట్ షిప్ యూఎస్ఎస్ మిల్ వాకీ, జాతికి అంకితమైన నెల రోజుల్లోనే షెడ్డుకొచ్చేసింది. గత నెల 21న జలప్రవేశం చేసిన ఈ యుధ్ధనౌకలోని గేర్ ఫిల్టర్ వ్యవస్థ పాడవడంతో సముద్రం మధ్యలో ఎటూ కదలకుండా ఆగిపోగా, దాన్ని తీరం వరకూ లాక్కొచ్చారు. 20 రోజుల పాటు సేవలందించిన ఈ నౌక చెడిపోవడంతో వర్జీనియాలోని నౌకా నిర్మాణ కేంద్రంలో మరమ్మతులు చేయించనున్నామని సెనెట్ ఆర్మ్ డ్ సర్వీస్ కమిటీ వెల్లడించింది. నౌక ఎందుకు చెడిపోయిందన్న విషయమై విచారణకు ఆదేశించినట్టు కమిటీ చైర్మన్ జాన్ మెక్ కెయిన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News