: రామ రాజ్యంలోనూ అత్యాచారాలు జరిగాయి!... యూపీ డీజీపీ వివాదాస్పద వ్యాఖ్య


మహిళలపై అకృత్యాలకు కేంద్రంగా మారిన ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద వ్యాఖ్యలకూ కొదవ లేదు. సాక్షాత్తు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతమూ అధికారంలో ఉన్న పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అత్యాచారాలపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ రాష్ట్ర డీజీపీ జగ్మోహన్ యాదవ్ వంతు వచ్చింది. అత్యాచారాలు సర్వ సాధారణమని, రామ రాజ్యంలోనూ బలాత్కారాలు జరిగాయని ఆయన నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో నెలలో పదవీ విరమణ చేయనున్న జగ్మోహన్ యాదవ్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అత్యాచారాలపై తనను ప్రశ్నించిన ఓ విలేకరిని తన గదిలోకి వస్తే సవివరంగా సమాధానమిస్తానని చెప్పి ఆయన మీడియాకు షాకిచ్చారు. జగ్మోహన్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News