: రాష్ట్రపతి ప్రణబ్ శీతాకాల విడిది షెడ్యూల్ ఇదీ!
శీతాకాల విడిదికి గాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేస్తారు. ఈ నెల 18వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు విడిది వివరాలు.. * 19వ తేదీ ఉదయం మిలిటరీ కాలేజ్ లో జరగనున్న సదస్సులో పాల్గొంటారు * 20, 21 తేదీల్లో రాష్ట్రపతి నిలయంలోనే ఉంటారు * 22వ తేదీన కర్నాటకలోని బీదర్ కు వెళ్లనున్నారు * 24 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలోనే గడుపుతారు * 27వ తేదీన జయశంకర్ యూనివర్శిటీలో వార్షిక కాంగ్రెస్ లో ప్రణబ్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి అదేరోజున వెళతారు. * 28,29 తేదీల్లో రాష్ట్రపతి నిలయంలోనే విశ్రాంతి తీసుకుంటారు * 30వ తేదీ సాయంత్రం ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు * 31 వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.