: విమానం 'స్కై డెక్'లో కూర్చోవచ్చు!


విమానంలో ప్రయాణించడమే ఒక మధురానుభూతి. విండో సీట్లో కూర్చుంటే... ప్రకృతి అందాలను చూస్తూ మైమరచిపోతాము. అదే కనుక, విమానం స్కై డెక్ లో సీట్లుండి.. అక్కడ కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఊహించలేము. అసలు అట్లాంటి విమానాలు ఉన్నాయా? అనే అనుమానం వస్తుంది. దానికి సమాధానం..‘ఉన్నాయి’ అని చెప్పవచ్చు. ఎందుకంటే, అమెరికాకు చెందిన ఏరోస్పేస్ టెక్నాలజీ కంపెనీ విండ్ స్పీడ్ ఈ తరహా విమానాన్ని తయారు చేసింది. ఇందులోని స్కైడెక్ డిజైన్ ఈ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రైవేటు జెట్, భారీ కమర్షియల్ విమానాలకు దీనిని అమర్చవచ్చు. విమానాల పైభాగంలో చిన్న గాజు డెక్ ఏర్పాటు చేస్తారు. దీనికింద ఒకటి లేదా రెండు సీట్లను అమరుస్తారు. ఎలివేటర్ లేదా మెట్ల సాయంతో ఈ డెక్ లోకి చేరుకోవచ్చు. నిర్ణీత కోణంలో ఈ సీటును తిప్పడం ద్వారా విమానంలో నుంచే బయటి ప్రపంచాన్ని చూడొచ్చు. అయితే, ఆ సీట్లలో కూర్చుని ప్రయాణికులు ఆనందించాలంటే ప్రత్యేక ధరలు చెల్లించుకోవాల్సిందేనని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News