: జార్ఖండ్ గని నుంచి లీకవుతున్న రేడియో ధార్మికత: యూఎస్


జార్ఖండ్ లోని జాదూగూడ యురేనియం గని నుంచి రేడియో ధార్మికత బయటపడుతోందని, దీని కారణంగా ఆ ప్రాంతంలో ప్రజలకు రిస్క్ పెరుగుతోందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ న్యూస్ ఆర్గనైజేషన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రాంతంలో పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గుతోందని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, వ్యవసాయ దిగుబడి పడిపోతోందని, అడవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఓ నివేదికను బయటపెట్టింది. కాగా, ప్రభుత్వ రంగ యూపీసీఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఈ గని బాధ్యతలను 1967 నుంచి నిర్వహిస్తోంది. రోజుకు 1000 టన్నుల యురేనియం ఖనిజాన్ని వెలికితీయడం ద్వారా భారత అణు విద్యుత్ అవసరాల్లో 20 శాతం ఇంధనాన్ని అందించే ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పారు. అయితే, సెప్టెంబర్ 2014 నుంచి దీనిని మూసివేశారు. 1990 నుంచి అణు ప్రభావం అక్కడి ప్రజలపై ఉందని నివేదికను రూపొందించిన అడ్రియాన్ లెవీ వివరించారు. ఇక్కడి సువర్ణ రేఖా నదిలో నీరు పూర్తిగా కలుషితం కావడానికి రేడియో ధార్మికత లీకవడమే కారణమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News