: అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ చూసిన ఎమ్మెల్యే సస్పెన్షన్


సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల రక్షణ కోసం చట్టాలు రూపొందించే గొప్ప స్థానంలో ఉండి కూడా... తన నీచ మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే. తాను చేస్తున్నది ఎవరూ చూడలేరనుకున్నాడో ఏమో కాని, బరితెగించేశాడు. కానీ, ఆ నీచపు పనిని మూడో కన్ను పట్టేసింది. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిశోర్ దాస్ తన మొబైల్ లో బ్లూ పిల్మ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. విషయం బయటకు పొక్కగానే, గందరగోళం చెలరేగింది. కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం, కిశోర్ దాస్ ను సభ నుంచి ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీనిపై కిశోర్ దాస్ స్పందిస్తూ, తాను తప్పు చేయలేదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అన్నాడు. మొబైల్ లో వెబ్ పేజీ ఓపెన్ చేస్తుండగా... యూట్యూబ్ లో పోర్న్ వీడియో ప్లే అయిందని... ఇందులో తన తప్పు లేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు, దాస్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికార బిజూ జనతాదళ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News