: వట్టి వసంతకుమార్ గాంధీగిరి... నడిరోడ్డుపై మంచం వేసుకుని పడుకున్న మాజీ మంత్రి
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ నిన్న రాత్రి గాంధీ గిరీ బాట పట్టారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్న వసంతకుమార్ నిన్న విశాఖలో వినూత్న నిరసనకు దిగారు. విశాఖలోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న కాలుష్యాలపై నిరసన గళం విప్పిన ఆయన, నిన్న రాత్రి ఉద్యమ బాట పట్టారు. నడిరోడ్డుపై నులక మంచం వేసుకున్న వసంతకుమార్ అక్కడే పడుకుండిపోయారు. దీంతో నగరంలోని సాగర్ నగర్ వివేకానంద కాలనీలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.