: ఫలక్ నూమాలో కార్డాన్ అండ్ సెర్చ్... 30 మంది రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాదు పాతబస్తీ పరిధిలోని ఫలక్ నూమాను నిన్న రాత్రి పోలీసులు చుట్టుముట్టారు. దాదాపు 350 మంది సాయుధ పోలీసులతో అక్కడికి తరలివచ్చిన సౌత్ జోన్ డీసీపీ ఇంటింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాత్రి వేళ ఒకేసారి వందలాది మంది పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇవేవీ పట్టించుకోని పోలీసులు తనిఖీల్లో మునిగిపోయారు. ఈ తనిఖీల్లో దాదాపు 30 మందికి పైగా రౌడీ షీటర్లు పోలీసులకు పట్టుబడ్డారు. అదే సమయంలో నిర్బంధంలో ఉన్న 24 మంది బాల కార్మికులకు కూడా పోలీసులు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. సోదాల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.