: టర్కీ బోటును టార్గెట్ చేసిన రష్యా
గగనతలంలో తమ విమానం కూల్చేసిన టర్కీపై రష్యా ఆగ్రహం ఇంకా చల్లారలేదు. రష్యాకు చెందిన యుద్ధనౌక టర్కీ పడవపై కాల్పులు జరిపిన ఘటన మరింత ఉద్రిక్తతలు పెంచుతోంది. ఏజియన్ సముద్రంలో లిమ్నస్ గ్రీకు దీవులకు 22 కిలోమీటర్ల దూరంలో టర్కీకి చెందిన పడవ రష్యా యుద్ధ నౌక ఎదురుగా వస్తోంది. తమను ఢీ కొట్టేలా వస్తున్న పడవపైకి రష్యా యుద్ధ నౌక హెచ్చరిక కాల్పులు జరిపింది. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అన్న విషయం ధ్రువీకరణ కావాల్సిఉంది. దీంతో రెండు దేశాల మధ్య మరింత శత్రుత్వం పెరిగే అవకాశం నెలకొంది.