: షకూర్ బస్తీ ఘటన అమానుషం: ఢిల్లీ హైకోర్టు


షకూర్ బస్తీలోని పేదల గుడిసెలను రైల్వే అధికారులు తొలగించడంపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ‘ఢిల్లీలోని షకూర్ బస్తీ ఘటన అమానుషం’ అని పేర్కొంది. గతంలో చేసిన పొరపాట్ల ద్వారా రైల్వే ఎటువంటి గుణ పాఠాలు నేర్చుకోలేదా? అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ సంఘటనలో వందలాది మంది వీధినపడటంతో పాటు ఒక చిన్నారి మృతి చెందిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘ఒక సర్వే నిర్వహించి, షకూర్ కాలనీ వాసులకు పునరావాసం కల్పించిన తర్వాతే అక్కడి గుడిసెలను తొలగించాలి కదా.. ఆ విధంగా ఎందుకు చేయలేదు?’ అన్న కోర్టు ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఈ సంఘటనపై రైల్వేకు, రైల్వే పోలీసులకు, తదితరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News