: ఎవరొచ్చినా సరే, నన్ను పిలవండి: షకూర్ బస్తీ బాధితులతో రాహుల్ గాంధీ


‘మీ గుడిసెలను ధ్వంసం చేసేందుకు ఎవరు వచ్చినా సరే, నన్ను పిలవండి.. నాకు ఫోన్ చేయండి.. మీ ముందుంటాను’ అంటూ ఢిల్లీలోని షకూర్ బస్తీ వాసులకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. నిన్న రైల్వే అధికారులు ఢిల్లీ నగరంలోని షకూర్ బస్తీలో పేదల గుడిసెలను తొలగించారు. ఈ సందర్భంగా ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం షకూర్ బస్తీకి వెళ్లి, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగానే ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ సంఘటనకు మోదీ, కేజ్రీ వాల్ సర్కార్లే కారణమని రాహుల్ ఆరోపించారు. బాధితులకు పునరావాసం కల్పించాల్సింది పోయి, వాళ్లిద్దరూ పరస్పరం నిందించుకుంటూ చాలా బిజీగా ఉన్నారని రాహుల్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News