: వాహన దారులకు శుభవార్త... 4 రూపాయలు తగ్గనున్న పెట్రోల్
వాహన దారులకు శుభవార్త. పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న ట్యాక్సులతో ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు భారత్ లో మాత్రం కిందికి దిగి రాలేదు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దిగజారడంతో లీటర్ పెట్రోలుపై ఒకేసారి 4 రూపాయలు తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం రేపు వెలువడే అవకాశం ఉంది.