: చండీయాగానికి గవర్నర్ ను ఆహ్వానించిన కేసీఆర్
అయుత చండీయాగానికి గవర్నర్ దంపతులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం హైదరాబాదులోని గవర్నర్ నరసింహన్ నివాసానికి ఆయన వెళ్లారు. సాంప్రదాయ పద్ధతిలో నరసింహన్ నుదుటిన తిలకం తిద్ది, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు అయుత చండీయాగం ఆహ్వాన పత్రికను కేసీఆర్ అందజేశారు. ఈ యాగానికి తప్పకుండా హాజరు కావాలంటూ గవర్నర్ దంపతులను కేసీఆర్ ఆహ్వానించారు.