: ఫ్రాన్స్ లో మరో ఐఎస్ తీవ్రవాది దాడి


ఫ్రాన్స్ లో మరో ఐఎస్ దాడి జరిగింది. ఫ్రాన్స్ లోని పారిస్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన తరువాత పోలీసులు ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభించారు. అయితే వారి ఏరివేత అంత సులువు కాదని తాజా ఘటన నిరూపించింది. పారిస్ శివారులోని ఆబర్ విలియర్స్ ప్రాంతంలోని జీన్ పెరిన్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న 45 ఏళ్ల వ్యక్తిని ముసుగు ధరించిన వ్యక్తి గాయపరిచాడు. నిరాయుధుడిగా వచ్చిన ముసుగు వ్యక్తి, తరగతి గదిలో దొరికిన కత్తెరతో పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతూ 'ఇది ఇస్లామిక్ స్టేట్...ఇదొక హెచ్చరిక' అంటూ నినాదాలు చేశాడని సహ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ తరగతి గదిలో విద్యార్థులు లేరని, కేవలం బాధిత ఉపాధ్యాయుడే ఉన్నారని, మిగిలిన ఉపాధ్యాయులు ఇతర గదుల్లో పాఠాలు బోధిస్తున్నారని వారు చెప్పారు. కాగా, కొన్ని రోజుల క్రితం పారిస్ లో ఉపాధ్యాయులు సెక్యులరిజం నేర్పిస్తున్నారని, వారంతా అల్లాకు శత్రువులని, వారిని చంపేయాలని ఐఎస్ ఫ్రెంచ్ పత్రిక దార్-అల్-ఇస్లాం లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News