: సల్మాన్ ఖాన్ పై ఒత్తిడి పెరుగుతోందా?


బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కోర్టు కేసుల నుంచి విముక్తి పొంది రిలాక్స్ అవుతుంటే ఒత్తిడి పెరగడమేంటనేగా మీ అనుమానం? అవును, పెళ్లి చేసుకోమంటూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సల్మాన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇన్నాళ్లు కోర్టు కేసులు అంటూ తప్పించుకున్న సల్మాన్ ను ఇప్పుడా సమస్యలు లేవు కనుక, ఇక పెళ్లి చేసుకోవాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో సల్మాన్ కూడా పెళ్లి దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సల్మాన్ విదేశీ స్నేహితురాలు లులియా వంతూర్ ను పెళ్లి చేసుకుంటాడా? లేక ఇంకెవర్నైనా ఎంచుకుంటాడా? అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. దీంతో సల్మాన్ పెళ్లి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఏమైనా, ఈ ఏడాది సల్మాన్ షాదీ చేసుకుంటాడని మాత్రం బాలీవుడ్ ఆశిస్తోంది.

  • Loading...

More Telugu News