: అసెంబ్లీ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్ల నియామకం
రాష్ట్ర అసెంబ్లీ స్థాయీ సంఘాలకు చైర్మన్లను నేడు ప్రకటించారు. 12 స్టాండింగ్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ శాసనసభ కార్యాలయం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. చైర్మన్ పదవుల్లో 9 అధికార కాంగ్రెస్ కే దక్కాయి. కాగా, ఒక్కో సంఘంలో 31 మంది సభ్యులు ఉంటారు. చైర్మన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
సంక్షేమ స్థాయీ సంఘం- ఆత్రం సక్కు
శాసనసభ మౌలిక సదుపాయాల సంఘం1- ఎర్రబెల్లి దయాకర్ రావు
శాసనసభ సదుపాయాల సంఘం 2- ఎమ్మెల్సీ ఎ. నర్సారెడ్డి
మానవ వనరుల స్థాయీ సంఘం- ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు
పట్టణాభివృద్ధి స్థాయీ సంఘం- ఎం. విజయప్రసాద్
గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం- ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి
రెవిన్యూ స్థాయీ సంఘం- జి.వి. శేషు
ఉపాధి కల్పన స్థాయీ సంఘం- బి.మస్తాన్ రావు
వ్యవసాయ స్థాయీ సంఘం- కె.సుధాకర్
వైద్య స్థాయీ సంఘం- వంగా గీత
అటవీ, పర్యావరణం స్థాయీ సంఘం- ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి
నీటి పారుదల శాఖ స్థాయీ సంఘం- పి. కిష్టారెడ్డి