: బ్యాంకులకు కావూరి శఠగోపం... ఆఫీస్ ముందు బ్యాంకు అధికారుల ఆందోళన


మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇటీవలే బీజేపీ గూటికి చేరిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బ్యాంకులకు టోకరా ఇచ్చారు. 18 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,000 కోట్ల మేర రుణాలు తీసుకున్న కావూరి సాంబశివరావుకు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ‘ప్రొగ్రెస్సివ్ కన్ స్ట్రక్షన్స్’ వాయిదా చెల్లింపులను చాలాకాలం క్రితమే నిలిపేసింది. బకాయిల వసూలు కోసం బ్యాంకులు జారీ చేసిన నోటీసులకు కూడా కావూరి సంస్థ స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదని భావించిన సదరు బ్యాంకుల అధికారులు హైదరాబాదులోని ఆయన కార్యాలయం ముందు నేటి ఉదయం నిరసనకు దిగారు. తీసుకున్న రుణాలు చెల్లించి బ్యాంకులు దివాళా తీయకుండా చూడాలని ఈ సందర్భంగా వారు కావూరిని కోరారు. ఉన్నట్టుండి బ్యాంకు అధికారులు తన కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో కావూరి షాక్ కు గురయ్యారు.

  • Loading...

More Telugu News