: ఆన్ లైన్ షాపర్లకు 'అమెజాన్' ఆఫర్


ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ తమ సైట్ లో షాపింగ్ చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇవాళ ఆ సైట్ లో రూ.500కు పైగా ఏ వస్తువును వినియోగదారులు కొన్నా రూ.200 గిఫ్ట్ కూపన్ ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ గిఫ్ట్ కూపన్ జనవరి 20వ తేదీలోగా వారికి అందుతుందని చెప్పింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో కొనుగోళ్లు జరిపే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వివరించారు. భారత్ లో తమ సంస్థను ఎక్కువమంది ఆదరిస్తున్నారని, ఈ ఏడాది అక్టోబర్ సీజన్ లో తమ సైట్ ద్వారానే కొనుగోళ్లను ఎక్కువగా జరిపినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం ప్రత్యేక గిఫ్ట్ కూపన్ ను అందిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News