: యోగా గురువు అయ్యంగార్ కు గూగుల్ నివాళి


ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యోగా గురువు బెల్లూరు కృష్ణమాచారి సుందరరాజా అయ్యంగార్ (బీకేఎస్ అయ్యంగార్) కు గూగుల్ నివాళులర్పించింది. ఇవాళ ఆయన 97వ జయంతిని పురస్కరించుకుని తన సెర్చ్ పేజ్ పై గూగుల్ ప్రత్యేక డూడుల్ ను ఉంచింది. లోగోలోని రెండో అక్షరం 'ఓ' స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్టుగా ఉన్న బొమ్మను పెట్టింది. డిసెంబర్ 14, 1918లో కర్ణాటకలో జన్మించిన అయ్యంగార్ చిన్నతనంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. దాంతో 15 ఏళ్ల వయసులోనే యోగాసనాలు వేయడం ప్రారంభించారు. తరువాత ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. తరువాత 18 ఏళ్ల వయసులో పూణె వెళ్లి యోగా పాఠాలు నేర్చుకున్నారు. తరువాత కాలంలో 72 దేశాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. యోగాకు సంబంధించి దాదాపు 14 పుస్తకాలు రచించారు. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆగస్టు 20, 2014లో అనారోగ్య కారణాలతో ఆయన పూణెలో కన్నుమూశారు.

  • Loading...

More Telugu News