: టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి పోలీసులను కూడా ప్రయోగిస్తున్నారు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతుండటంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి పోలీసుల చేత కూడా బెదిరింపులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులే రాయబారం నెరపుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. పోలీసులతో భయపెట్టి వారిని ఏదో విధంగా పార్టీలో చేరేలా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలపై తమ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.