: మీ దుర్మార్గాలపై ఈ సాక్ష్యం చాలదా?: పాక్ ను ప్రశ్నిస్తున్న భారత సైన్యం


భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు జరిపి విధ్వంసం సృష్టించేందుకు పాక్ జాతీయులు వస్తున్నారని, వారికి జమాత్ - ఉద్ - దవా (జేయూడీ) వంటి ఉగ్రవాద సంస్థలు అండగా నిలుస్తున్నాయనడానికి మరింత గట్టి ఆధారాలు సైన్యానికి దొరికాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ సెక్టారులో ఆర్మీ జవానులు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్లో మరణించిన ముష్కరుడి దగ్గర 'మేడిన్ పాకిస్థాన్' ఆహార పదార్థాలు, జేయూడీ అని ఉర్దూలో రాసున్న టీ-షర్టులు లభించాయి. భారత, పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద క్యాంపులతో జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ చర్చలు జరుపుతున్నారనడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నట్టు భారత భద్రతా దళాలు చెబుతున్నాయి. ఇండియాపై దాడుల కోసం వీరిని జమ్మూకాశ్మీర్ మీదుగా దేశంలోకి పంపుతున్నారని, అందుకు మేడిన్ పాకిస్థాన్ ఫుడ్ మెటీరియలే సాక్ష్యమని సైనికులు అంటున్నారు. ఇండియాలో పాక్ దుర్మార్గాలపై, ఇస్లామాబాద్ పెద్దలు ఈ సాక్ష్యాలను చూసి ఏమంటారని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News