: తెలంగాణకు చుక్కెదురు... మీ శకటం బాగాలేదన్న కేంద్రం!
జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగే శకటాల ప్రదర్శనలో తెలంగాణ పాల్గొనబోవడం లేదు. ఈ దఫా తెలంగాణ సర్కారు మూడు శకటాల మోడల్స్ ను తయారు చేసి కేంద్ర హోం శాఖకు పంపగా, మూడింటినీ నిరాకరిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. గత సంవత్సరం రిపబ్లిక్ వేడుకల్లో కూడా తెలంగాణ శకటం, సెలక్షన్ కమిటీని ఆకర్షించలేకపోయిన సంగతి తెలిసిందే. కాగా, రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశమయ్యే కమిటీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే శకటాల నమూనాల నుంచి కొన్నింటిని ఎంపిక చేస్తుంది. ఇవి గణతంత్ర దినోత్సవం నాడు పరేడ్ చేస్తాయి.