: చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్ హంతకుల ఆచూకీ తెలిపిన ట్రక్ డ్రైవర్


సంచలనం సృష్టించిన చిత్రకారిణి హేమా చింతన్ ఉపాధ్యాయ్, ఆమె న్యాయవాది హరీష్ భంబానీ హత్యకేసులో నిందితుల ఆచూకీ తెలిసిపోయింది. వీరిద్దరి మృతదేహాలూ ప్లాస్టిక్ కవర్లలో 'కాండివాలి' కాలువలో శనివారం నాడు చెత్త ఏరుకునే పిల్లలకు కనిపించగా, ఓ ట్రక్ డ్రైవర్ నిందితుల గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమకు తెలిసిన వ్యక్తేనని పోలీసులు తేల్చారు. తన పెయింటింగ్స్ దాచుకునే వేర్ హౌస్ యజమాని గోటుతో ఆమెకు రూ. 5 లక్షల విషయమై వివాదం ఉండగా, ఆ నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని తెలిపారు. కాగా, శుక్రవారం నాడు హేమ కనిపించడం లేదని ఫిర్యాదు అందగా, పోలీసులు మూడు టీంలను రంగంలోకి దించారు. ఆమె చివరిగా న్యాయవాదితో ఫోన్లో మాట్లాడిందని, ఆపై వేర్ హౌస్, కాండివాలీ మధ్య రాత్రి 8:30 గంటల సమయంలో వారి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయని గమనించారు. ఆపై శనివారం నాడు చెత్త ఏరుకునే వారు వీరి మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆపై నిందితులు ఎవరో కనుగొనే పనిలో పోలీసులు ఉండగా, చెత్తను డంప్ యార్డునకు చేర్చే ఓ ట్రక్ డ్రైవర్ నుంచి కీలక సమాచారం లభించింది. తనను పిలిచిన గోటు కొంత చెత్తను బయట పడేయాల్సి వుందని చెప్పాడని, రెండు పెద్ద కార్టన్లు తెచ్చి లారీలో వేసి, తనతో పాటు వచ్చి మృతదేహాలు దొరికిన చోట లారీని ఆపించి వారు దిగారని పోలీసులకు చెప్పాడు. ఆదివారం ఉదయం దినపత్రికల్లో మృతదేహాలు లభించిన ప్రాంతాన్ని చూసిన తరువాత, తాను లారీని అక్కడే ఆపిన విషయం గుర్తొచ్చి, వారే హత్య చేసి వుండవచ్చన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపాడు. ఇక కీలక క్లూ లభించడంతో గోటు కోసం గాలిస్తున్న పోలీసులు వేర్ హౌస్ లో ఓ డ్రైవర్, సహాయకులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News