: 'స్మార్ట్ ఆంధ్ర' వ్యవస్థాపక చైర్మన్ రతన్ టాటా!


స్మార్ట్ గ్రామాలు, వార్తలను ఎంపిక చేసేందుకు నియమించిన నోడల్ ఏజన్సీ 'స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్'కు చైర్మన్ గా ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పేరును ఖరారు చేస్తూ, చంద్రబాబునాయడు నేడో, రేపో ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓ స్వతంత్ర సంస్థగా స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ పనిచేస్తుందని, కార్పొరేట్ సంస్థలు తమ 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ'లో భాగంగా అందించే నిధులతో పాటు వివిధ సంఘాలు, ఎన్నారైల నుంచి వచ్చే విరాళాలను సక్రమంగా ఖర్చు పెడుతూ, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఫౌండేషన్ లో జిల్లా స్థాయి శాఖలూ ఏర్పాటు కానున్నాయి. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ, జీఎంఆర్, జీవీకే సంస్థల చైర్మన్లు తదితరులు సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News