: పశ్చిమగోదావరి జిల్లాలో టోర్నడో... గంటపాటు బెంబేలెత్తిన జనం
దుమ్మూ ధూళీని లేపుతూ సుడులు తిరిగే వలయంతో ప్రత్యక్షమయ్యే సుడిగాలులు మనకు కొత్తేమీ కాదు. అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే సుడిగాలి పెద్దగా ఇబ్బందేమీ పెట్టదు. అయితే ఇదే సుడిగాలి తీవ్రత విపరీతంగా పెరిగితే మాత్రం బీభత్సం తప్పదు. దానికే శాస్త్రవేత్తలు టోర్నడో అని పేరు పెట్టారు. అలాంటి టోర్నడోలను మాత్రం మనం ఎన్నడూ చూడలేదు. అయితే పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం శంకరపాలెంలో ఓ చిన్న తరహా టోర్నడో నిన్న అక్కడి జనాన్ని తీవ్రంగా భయపెట్టింది. దాదాపు వంద అడుగుల మేర ఎత్తులో ఎగసిన దుమ్మూ, ధూళీ దాదాపు గంట పాటు సుడులు తిరుగుతూనే ఉందట. దీంతో శంకరపాలెం వాసులు ఆ గంట సేపు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.