: హోమ్ సిక్ లో పాక్ టెర్రరిస్ట్!... జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న నవీద్


లష్కరే తోయిబా ఉద్రేకపూరిత ప్రసంగాలకు ఆకర్షితుడై భారత్ పైకి దాడికి తెగబడిన పాకిస్థాన్ ఉగ్రవాది నవీద్ యాకూబ్ కు ఇంటి బెంగ పట్టుకుంది. ప్రస్తుతం అతడు హోమ్ సిక్ తో నానా ఇబ్బంది పడుతున్నాడని ఓ ఆంగ్ల దినపత్రిక నిన్న ప్రత్యేక కథనం రాసింది. ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్న నవీద్ ప్రస్తుతం జమ్మూ జైల్లో ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, సోదరులు, సోదరిని గుర్తు చేసుకుని అతడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట. ఎట్టకేలకు తన కుటుంబానికి చెందిన ఓ రెండు సెల్ ఫోన్ నెంబర్లను రాసిచ్చిన అతడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడించాలని వేడుకున్నాడు. అతడి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక కోర్టు కుటుంబ సభ్యులతో అతడు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఆ రెండు నెంబర్లకు ఫోన్ చేసిన జమ్మూ జైలు అధికారులకు ‘నాట్ రీచబుల్’ అనే సమాధానం వచ్చిందట. దీంతో నవీద్ ఏడుపును ఎలా ఆపాలో వారికి తెలియడం లేదని ఆ పత్రిక కథనం పేర్కొంది. నవీద్ ఇచ్చిన రెండు సెల్ ఫోన్ నెంబర్లు అతడి కుటుంబ సభ్యులవే అయి ఉంటాయని పేర్కొన్న ఆ కథనం, నవీద్ కు ఫైసలాబాదుతో సంబంధాలను చెరిపేసే క్రమంలోనే పాకిస్థాన్ అధికారులు ఆ రెండు నెంబర్లను తొలగించి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News