: ‘గ్రేటర్’ పీఠం గులాబీ దళానిదేనట!... ‘వీడీపీ అసోసియేట్స్’ సర్వేను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేటీఆర్


తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్సే విజయం సాధిస్తుందట. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో సర్వే నిర్వహించిన ‘వీడీపీ అసోసియేట్స్’ సంస్థ తేల్చి చెప్పింది. అంతేకాక త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కనున్నాయన్న అంశాన్ని కూడా ఆ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికను టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సర్వేను పరిశీలిస్తే... ఎన్నికల్లో 70 డివిజన్లను గెలుచుకోనున్న టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక పాతబస్తీలో మంచి పట్టున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) 42 డివిజన్లలో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 16 డివిజన్లలో గెలుస్తుంది. టీడీపీకి 11, బీజేపీకి 8, ఇతరులకు 3 స్థానాలు దక్కుతాయి.

  • Loading...

More Telugu News