: దేవిశ్రీ ప్రసాద్ కు పితృ వియోగం... గుండెపోటుతో కన్నుమూసిన సినీ రచయిత సత్యమూర్తి
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి, పేరెన్నికగన్న చిత్ర రచయిత సత్యమూర్తి (61) ఇక లేరు. చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన సత్యమూర్తి కన్నుమూశారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెపోటు కారణంగా కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తండ్రి బాటలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. నేటి సాయంత్రం చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.