: అందరూ కలిసి పనిచేస్తేనే అద్భుతాలు సాధించగలం: గవర్నర్ నరసింహన్


అందరూ కలిసి పనిచేస్తేనే అద్భుతాలు సాధించగలమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. నరసరావుపేట పురపాలక సంఘ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసరావుపేట నుంచి ఎందరో మహానుభావులు వచ్చారని అన్నారు. జీవన విధానంలో పర్యావరణం, చదువు, ఆరోగ్యం చాలా ముఖ్యమైనవని అన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని, ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. చిన్నారులందరినీ పాఠశాలలకు పంపించాలని సూచించారు. ఏడాదిలోగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు. యల్లమంద గ్రామంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండటం మంచి పరిణామమని అన్నారు.

  • Loading...

More Telugu News